టీవీకే చీఫ్ విజయ్ విడుదల చేసిన వీడియో సందేశంపై డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. సీఎం స్టాలిన్‌పై విజయ్ చేసిన విమర్శలను తిరస్కరించిన డీఎంకే, “వీడియో విడుదల చేయడానికి నాలుగు రోజులు పట్టిందా?” అంటూ ఎద్దేవా చేసింది.
డీఎంకే నాయకుడు శరవణన్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రాణనష్టం జరిగిందని, దానికి విజయ్ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.

