హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ రాజకీయ పార్టీల హామీల పోటీ ఆసక్తికరంగా మారింది. ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త పద్ధతిలో ప్రచారం మొదలుపెట్టింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్ల వద్ద “ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..” అంటూ వెలసిన కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గెలిపిస్తే ఉచితంగా కేబుల్ కనెక్షన్ ఇస్తామని, ఇకపై డీటీహెచ్, కేబుల్ టీవీ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు.
ఈ ఫ్లెక్సీలు, హామీలు స్థానిక ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఉచిత కేబుల్ కనెక్షన్ హామీ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

