Tv424x7
Andhrapradesh

జీవిత ఖైదీకి బంగారు పతకం – స్ఫూర్తిదాయక గాథ

ఏర్పేడు మండలం, జంగాలపల్లి:

కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ విద్యలో కొత్త చరిత్ర సృష్టించాడు. జైలులో శిక్ష అనుభవిస్తూనే చదువుపై మక్కువతో, పోలీసుల సహకారంతో ఇప్పటివరకు 4 డిగ్రీలు, 3 పీజీలు పూర్తి చేశాడు.

తాజాగా BA పరీక్షల్లో 8.2 పాయింట్లు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ ప్రతిభకు గుర్తింపుగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో యుగంధర్‌కు బంగారు పతకంతో పాటు బుక్ ప్రైజ్ అవార్డు అందించారు.

ఈ సందర్భంగా మహిళా శక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఈ. అరుణరెడ్డి మాట్లాడుతూ –“శిక్ష అనుభవిస్తున్నా విద్యతో కొత్త జీవితం నిర్మించుకోవచ్చని యుగంధర్ నిరూపించాడు. ఆయన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలి” అని పేర్కొన్నారు.

Related posts

వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన్న మాజీ సీఎం వైయస్ జగన్..

TV4-24X7 News

అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

యువకుడు బైక్ ఢీ కొట్టి కారుపై ఎగిరిపడ్డాడు!

TV4-24X7 News

Leave a Comment