Tv424x7
Telangana

నటి రంగ సుధాపై అసభ్యకర పోస్టులు….పోలీసులకి ఫిర్యాదు..

హైదరాబాద్

నగరంలో మరోసారి సోషల్ మీడియా వేధింపుల వివాదం బయటకు వచ్చింది. ప్రముఖ నటి రంగ సుధాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన నటి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో ఆమె, రాధాకృష్ణ అనే వ్యక్తి తో పాటు కొన్ని ట్విట్టర్ పేజీల నిర్వాహకులు తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా, తనపై ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరింపులు కూడా వచ్చినట్టు పేర్కొన్నారు.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా వేధింపులు పెరుగుతున్న తరుణంలో, ఈ కేసు చర్చనీయాంశంగా మారింది

అనూష

Related posts

పాతబస్తీ మాన్‌హోల్ ఘటనపై HYDRAA పై ప్రభుత్వం సీరియస్!!

TV4-24X7 News

RTCలో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు!

TV4-24X7 News

వడ్డీ టోపీ కింద 300 కోట్ల మోసం!!

TV4-24X7 News

Leave a Comment