హైదరాబాద్ : మోసగాళ్ల పన్నాగాలకు పెద్దమనుషులు కూడా బలి అవుతున్నారు. అధిక వడ్డీ ఆశ పెట్టుకున్నా చివరికి బొక్కసొట్టెలుగా మిగిలిపోతున్నారు. తాజాగా సంచలన మోసం బయటపడింది.
వడ్డీ పేరుతో గార్మెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే బంగారు లాభాలు వస్తాయని చెప్పి ప్రముఖులనే టార్గెట్ చేసిన సింగిల్ లేడీ సంధ్యారాణి దాదాపు ₹300 కోట్లకు టోపీ పెట్టింది. బాధితుల జాబితాలో పెద్ద వ్యాపారులు, అధికారులు, IASలు ఉన్నట్లు సమాచారం.
ఈమె చేతిలో మోసపోయిన వైజాగ్‌కు చెందిన దొరైరాజు అనే వ్యాపారి, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బహిర్గతమైంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంధ్యారాణిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
👉 వడ్డీల ఆశ చూపించి డబ్బులు దోచుకునే మోసాలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.

