హైదరాబాద్ రవీంద్ర భారతిలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ప్రతిష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గురువారం సాంస్కృతిక శాఖ అధికారులు, విగ్రహా ఏర్పాటు కమిటీ సభ్యులు రవీంద్ర భారతి ఆవరణను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎస్పీబీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిమ ద్వారా ఎస్పీ బాలు గారి గానమాధుర్యాన్ని, ఆయన తెలుగు సినీ సంగీతానికి చేసిన సేవలను తరతరాలు స్మరించుకునే అవకాశం లభించనుంది. 🎶

