మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిరసన తెలుపుతున్న హామలీలను ఎస్పీ ఆప్యాయంగా పలకరించి, రైతన్నకు కష్టకాలంలో అందరం తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.
అలాగే అధికారులు ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని, సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎస్పీ చొరవతో హామలీలు తమ నిరసనను విరమించారు.
రజిత

