మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రంలో హమాలీ కార్మికులను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించారు.
రైతులకు ఎరువులు అందించడంలో హమాలీ సోదరులు చూపుతున్న కృషి అమూల్యమని ఆయన ప్రశంసించారు. “దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవడం గొప్ప విషయం. యూరియా పంపిణీలో మీ శ్రమ వెలకట్టలేనిది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పట్టించుకోకుండా రైతుల కోసం పనిచేయాలని” ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని యూరియా కేంద్రాల వద్ద పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
తమ కృషిని గుర్తించినందుకు ఎస్పీకి హమాలీ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. “మీలాంటి పెద్దసార్లు ఇలా మన దగ్గరకు వచ్చి మన శ్రమను గుర్తించడం మాకు గర్వకారణం. రైతుల కోసం మరింత కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు.
Anusha

