తిరుపతి జిల్లా, తిరుమల:
భక్తుడి ముసుగులో తిరుమల చేరి భక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పోలీస్ కాంప్లెక్స్‌లో సి.ఐ శ్రీరాముడు వివరాలను వెల్లడించారు.స్వాధీనం చేసిన వస్తువులు15 మొబైల్ ఫోన్లు (విలువ రూ.3.5 లక్షలు)20 గ్రాముల బంగారు ఆభరణాలు
నిందితుడు వివరాలు
పేరు: మెట్టు కిషోర్ రెడ్డి (36)
స్వస్థలం: పాత సూర్యాపేట, నల్గొండ జిల్లా, తెలంగాణ
ముఖ్యాంశాలునకిలీ ఆధార్ కార్డు, తప్పుడు ఫోన్ నంబర్లతో PAC-3 లో లాకర్ తీసుకొని భక్తుల వస్తువులు దొంగిలించేవాడు.గత నెలలో C-టైప్ క్వార్టర్స్‌లో తలుపు పగలగొట్టి నగలు, నగదు దొంగిలించి పరారయ్యాడు.
రెండు కేసులు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయ్యాయి.నిందితుడు జల్సాలు, ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై కుటుంబానికి దూరంగా సంచార జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.భక్తులకు సూచనలు
యాత్రికులు రద్దీ ప్రాంతాలలో (PAC, బస్టాండ్, సి.ఆర్.ఓ. ఆఫీస్, క్యూలైన్లు) తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
సొంత వాహనాలలో విలువైన వస్తువులు ఉంచకుండా, టిటిడి నిర్వహించే లాకర్లలో భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు.

