మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది.
స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెను ఉక్కబట్టి హత్య చేసి, అనంతరం ప్రియుడితో పరారైన ఘటన గ్రామంలో కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు.
తల్లి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనూష

