ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
గురువారం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అంతేకాకుండా గతంలో కూడా పలుమార్లు ఉరివేసుకునే ప్రయత్నం చేసినట్టు వారు పోలీసులకు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

