దువ్వూరు పట్టణంలో ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు బస్ షెల్టర్ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో నిధులు కేటాయించగా, అధికారులు ప్రధాన రహదారిపై పునాది పనులు ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన ఆశ్రయం లేక వర్షం, ఎండల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడంతో ఆధునిక సదుపాయాలతో బస్ షెల్టర్ నిర్మాణం ప్రారంభమైందని వారు తెలిపారు.
స్థానికులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ బస్ షెల్టర్ పూర్తి అయితే ప్రయాణికులకు గణనీయంగా ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

