Tv424x7
Andhrapradesh

మన్నెం శ్రీనివాసరావు దంపతుల నుంచి టీటీడీకి రూ.20 లక్షల విరాళం!!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మంగళగిరి నివాసి మన్నెం శ్రీనివాసరావు – అరుణ దంపతులు విశేష విరాళం అందజేశారు.

సోమవారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి, వారు రూ.20 లక్షల విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్టులను అందజేశారు.

ఈ సందర్భంగా దంపతులు తమ కుమార్తెల పేర్లపై విరాళాలను సమర్పించారు.

కుమార్తె మన్యం హారిక పేరు మీద ఎస్‌వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.10,00,116

కుమార్తె మన్యం హరిత పేరు మీద ఎస్‌వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.10,00,116 విరాళం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీదేవి పాల్గొన్నారు. దాతల ఔదార్యాన్ని చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు.

Related posts

నేడు కార్తీక పున్నమి

TV4-24X7 News

ఏపీలో డ్వాక్రా మహిళలకు రుణా అవకాశాలు!!

TV4-24X7 News

కళకళ లాడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం

TV4-24X7 News

Leave a Comment