వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని పలువురు స్థానిక నాయకులు సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా యాడికి మండల వైస్సార్సీపీ కన్వీనర్, తూట్రాలపల్లి సర్పంచ్ ఎం.సంజీరాయుడు, పెద్దవడుగూరు మండల వైస్సార్సీపీ కన్వీనర్ ఎద్దుల శరబరెడ్డి, భీమునిపల్లి సర్పంచ్ రామచంద్ర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, కేశవరెడ్డి తదితరులు హాజరై ఆమెను పరామర్శించారు.
నాయకులు స్వర్ణలత గారి ఆరోగ్యంపై సమాచారం తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం రాబోయే రోజుల్లో కలిసి పని చేస్తామని భరోసా ఇచ్చారు.

