మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లాకు చెందిన మంత్రి వివేక్ తన సొంత ప్రాంతంలో జాతీయ జెండా కూడా ఎగురవేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాలలో ఏకైక మంత్రిగా ఉన్నప్పటికీ, ఆగస్టు 15న ఆయన వేరే జిల్లాలో జెండావిష్కరణ చేయాల్సి వచ్చింది.
తాజాగా సెప్టెంబర్ 17న కూడా ఇన్‌చార్జ్‌గా ఉన్న మెదక్ జిల్లాలో జెండా ఎగురవేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు – మంత్రి వివేక్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
ప్రేమ్ సాగర్ రావుకే మంత్రిపదవి వస్తుందని అంచనాలు ఉండగా, అది వివేక్‌కు రావడంతో అసహనం పెరిగిందని పార్టీ వర్గాల టాక్.
“తన నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దు” అని ప్రేమ్ సాగర్ హెచ్చరించారని ప్రచారం.
ఈ పరిణామాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కార్యకర్తల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

