రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 17వ తేదీ విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను ఘనంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శిల్పకళ, వాస్తుశాస్త్ర దేవుడైన విశ్వకర్మను ప్రతి సంవత్సరం వృత్తిదారులు, శిల్పులు, కార్మిక వర్గాలు ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.
సంబంధిత శాఖలు, అధికార యంత్రాంగం పండుగకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

