తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, ఏఓ మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

