నిజమైన లౌకికవాదాన్ని విశ్వసిస్తా – చీఫ్ జస్టిస్ గవాయ్📍
న్యూఢిల్లీ:
:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టీకరణ ఇచ్చారు.
అన్ని మతాలను గౌరవిస్తానని, ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు అన్నింటినీ సందర్శిస్తానని తెలిపారు.“నిజమైన లౌకికవాదంలో నాకు గాఢమైన నమ్మకం ఉంది” అని వ్యాఖ్యానించారు
సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు తప్పుగా చిత్రీకరించబడటంపై స్పందించారు.“నా మాటలను సందర్భానికి అన్వయించకుండా అపార్థం చేసుకున్నారు” అని చెప్పారు.
పురావస్తు శాఖ (ASI) పరిధిలో ఉన్న కట్టడాలపై కోర్టు ఎలా ఆదేశాలు ఇవ్వగలదో ప్రశ్నించారు
జావరి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం పునర్నిర్మాణంపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ వివరణ ఇచ్చారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా గవాయ్ గారి లౌకికతను సమర్థించారు.

