Tv424x7
Andhrapradesh

దువ్వూరులో నిబంధనలు అతిక్రమించిన 4 ఆర్.ఎం.పి. క్లినిక్‌లు సీజ్

కడప/మైదుకూరు: దువ్వూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ఆర్.ఎం.పి. క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు.

డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ వి. మల్లేష్ ఆధ్వర్యంలో ఆరోగ్య విభాగం బృందం శుక్రవారం (19-09-2025) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.తనిఖీల్లో భాగంగా క్లినిక్‌లలో పరిమితికి మించి చికిత్సలు ఇస్తున్నట్లు, యాంటీబయాటిక్స్, సెలైన్ బాటిల్స్, వాడిన వైద్య సామాగ్రి అధికంగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. సరైన అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం రోగుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.హెచ్.ఇ.ఓ. పి. రాజగోపాల్, సూపర్‌వైజర్లు ఎం. శివగంగ రాజు, డి. వెంకటేశ్వర్లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే క్లినిక్‌లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Related posts

నిజ‌మే.. వారిలో ఒక్క‌రూ పాసవ‌లేదు : ఏపీ సీఎం చంద్ర‌బాబు

TV4-24X7 News

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..

TV4-24X7 News

రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్తే పత్రాలు తప్పనిసరి – లేకపోతే సీజ్..

TV4-24X7 News

Leave a Comment