Tv424x7
Cinima News

సినీ పెద్దల మీటింగ్‌లో బాలకృష్ణకు గైర్హాజరు

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అగ్రనటులు, ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు హాజరైన ఒక కీలక సమావేశం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీటింగ్‌కు సినీ పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో తెలియదని భావించి నందమూరి బాలకృష్ణను పక్కన పెట్టారని ఇన్సైడ్ టాక్.ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో సినిమా పైరసీ రాకెట్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఫిల్మ్‌ల HD వెర్షన్‌లు లీక్ అవుతున్నాయన్న విషయాన్ని తెలిసి సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. ఇకపై బెట్టింగ్ యాప్‌లకు మద్దతు ఇవ్వకూడదని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే, ఈ యాప్ నిర్వాహకులే హ్యాకర్లకు, పైరసీ గ్యాంగ్‌లకు నిధులు సమకూరుస్తున్నారని బయటపడింది.డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ మీటింగ్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలను అందరూ అభినందించారు.

Related posts

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

రజనీకాంత్ హిమాలయ యాత్ర: మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గం..

TV4-24X7 News

ప్రభాస్‌ అమితాబ్‌ బచ్చన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు: మీతో పని చేయడం గౌరవం..

TV4-24X7 News

Leave a Comment