కాకినాడ టౌన్, సెప్టెంబర్ 30: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించేందుకు జనసేన పార్టీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరి ప్రసాద్ గారు సోమవారం కాకినాడ కలెక్టర్‌ను కలిసారు. స్థానిక సమస్యలు, రహదారి పనులు, ప్రజా సౌకర్యాలు, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు, పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ లీగల్ టూర్ పర్మిషన్ ఇంచార్జ్ చోడిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
previous post

