Tv424x7
Andhrapradesh

విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు

పల్నాడు జిల్లా, చిలకలూరిపేటఏపీ మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు నమోదైంది. చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ – “2022లో నా ఇల్లు, కారుపై, అలాగే నవతరం పార్టీ ఆఫీసుపై మాజీ మంత్రి విడదల రజనీ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసాను” అని తెలిపారు.అలాగే, తన ఫిర్యాదు నమోదు అయిన తర్వాత అందిన టికెట్‌ను మీడియా ముందు ప్రదర్శించారు. “జగన్ గారు ఈ ఫిర్యాదుపై న్యాయం చేస్తే, వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా న్యాయం లభిస్తుందని నమ్మకం కలుగుతుంది. ఫిర్యాదు చేస్తే నిజంగా స్పందన వస్తుందన్న విశ్వాసం పెరుగుతుంది” అని రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

Related posts

ఇక సెలవు.. ముగిసిన ‘కోట’ అంత్యక్రియలు.. దహన సంస్కారాలు ఎవరు నిర్వహించారంటే..!!

TV4-24X7 News

అయ్యప్పలకు అన్నసమారాధన

TV4-24X7 News

జగన్ సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు: సోమిరెడ్డి ఫైర్

TV4-24X7 News

Leave a Comment