గాజా యుద్ధం ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాపై ఇజ్రాయెల్ దాదాపుగా అంగీకారం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లను పొగడ్తలతో ముంచెత్తారు. మొదటి నుంచే పాకిస్థాన్ ఈ విషయంలో తమకు బలమైన మద్దతుగా నిలిచిందని ఆయన అభినందించారు.మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గాజా సమస్య పరిష్కారంలో ట్రంప్ తీసుకున్న వైఖరిని ప్రశంసించారు. దీంతో అమెరికా సూచించిన శాంతి ఫార్ములా అమలుపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.
previous post

