అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల కోసం మరో శుభవార్తను ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందించే ఎన్టీఆర్ బేబీ కిట్‌లో కొత్తగా రెండు వస్తువులు చేర్చాలని నిర్ణయించింది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల బేబీ కిట్‌ను పరిశీలించి, అందులో ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్‌ను చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది.ప్రతి ఏడాది దాదాపు 3.20 లక్షల మంది తల్లులకు ఈ బేబీ కిట్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.2016లో టీడీపీ ప్రభుత్వం శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కొనసాగించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి, మరింత మెరుగులు దిద్దుతోంది.

