Tv424x7
Andhrapradesh

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం!!

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈరోజు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బ్యాంక్ రెపో రేటును 5.5 శాతం యథాతథంగా ఉంచుతూ ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం, కట్టే EMIలలో ఎలాంటి మార్పులు ఉండవు.

ఇటీవల RBI, దేశీయ ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా కొన్ని కీలక సమావేశాల్లో రేపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, ఏప్రిల్‌ 2025లో 0.25 శాతం తగ్గింపులు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు జరిగింది. ఇలా మూడు సమావేశాల్లో మొత్తం 1 శాతం రేటు తగ్గింపు గమనించబడింది.

అయితే, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా పన్నుల విధానం వంటి కారణాల నేపథ్యంలో RBI ఆగస్టు మరియు అక్టోబర్ 2025లో రేటును స్థిరంగా 5.5 శాతం వద్ద ఉంచింది.

Related posts

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News

రేపు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ తో పాటు 144 సెక్షన్

TV4-24X7 News

తెలుగు సంప్రదాయా ముగ్గుల చరిత్ర

TV4-24X7 News

Leave a Comment