న్యూ ఢిల్లీ :
కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
డీఏ పెంపు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చుల భత్యం (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెంపు జూలై 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా 49.2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
కేంద్రీయ విద్యాలయాలు : విద్యా రంగం విస్తరణలో భాగంగా ప్రభుత్వం 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు ఆమోదం తెలిపింది.
పప్పు దినుసుల నిధులు : ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పప్పు దినుసుల ఉత్పత్తి, సరఫరా బలోపేతానికి ₹11,440 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యవసాయరంగానికి ఉపశమనం కలిగించేలా ఉంటాయని కేంద్ర మంత్రివర్గం పేర్కొంది.

