Tv424x7
Andhrapradesh

అనంతపురం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ

అనంతపురం:

దసరా పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుర్గామాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, కర్పూరహారతి సమర్పించారు. అనంతరం జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటూ దుర్గామాతను ప్రార్థించారు.

ఈ సందర్భంగా పోలీసు విభాగం వినియోగించే తుపాకులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించే వాటర్ కేనన్, బాంబు నిర్వీర్య వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన సబ్సిడరీ క్యాంటీన్ భవనంను ప్రారంభించి అక్కడ కూడా పూజలు నిర్వహించారు.

తర్వాత డిపిఓ ప్రాంగణంలోని నూతన ఫిరంగి వద్ద, పోలీస్ పెట్రోల్ బంకుల వద్ద నిర్వహించిన ఆయుధ పూజల్లోనూ ఎస్పీ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అర్బన్ & రూరల్ డీఎస్పీలు వి. శ్రీనివాసరావు, వెంకటేశులు, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు, ఆర్‌ఐలు, బి సూపరింటెండెంట్ ప్రసాద్, పోలీసు అధికారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

TV4-24X7 News

తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పుట్టా సుధాకర్

TV4-24X7 News

ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment