Tv424x7
Andhrapradesh

హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో డీఎస్సీ ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

గుంటూరు:

పాయకరావుపేట నియోజకవర్గంలో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వేంపాడు టోల్‌ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి అనిత సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పతకాలు, అలాగే ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా పాయకరావుపేట మండలం PLపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్‌ను మంత్రి స్వయంగా అందజేశారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వహిస్తారని, పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, ఈ డీఎస్సీ కోసం మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.

Related posts

మహాలయ అమావాస్య – పితృదేవతల ఆరాధనకు విశిష్ట దినం

TV4-24X7 News

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

Leave a Comment