చైనా 2030 నాటికి తన మిత్రదేశం పాకిస్థాన్‌కు జే–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు అందించేందుకు సిద్ధమవుతోంది.
ఇక భారత్ వద్ద మాత్రం ప్రస్తుతం నాలుగో తరం రాఫెల్ విమానాలే ఉన్నాయి.
స్వదేశీ ‘ఆమ్కా’ ప్రాజెక్టు పూర్తవ్వడానికి కనీసం పదేళ్లు పట్టే అవకాశం ఉంది.విదేశీ ఎఫ్–35, సుఖోయ్–57 కొనుగోళ్లపై కఠిన షరతులు, సాంకేతిక అడ్డంకులు తలెత్తుతున్నాయి.
రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, భారత్ దశాబ్ద కాలం వ్యూహాత్మకంగా వెనుకబడే అవకాశం ఉంది.

