Tv424x7
National

భారత మహిళలకు ప్రపంచ కప్‌ కిరీటం – చరిత్ర సృష్టించిన టీమిండియా

హైదరాబాద్‌, నవంబర్‌ 03:మహిళల క్రికెట్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 2025 మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు స్థిరమైన ఆరంభం చేసి, కీలక భాగస్వామ్యాలతో బలమైన స్కోరు సాధించింది. అనంతరం బౌలర్లలో దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె బౌలింగ్‌ ఝళిక ముందు దక్షిణాఫ్రికా జట్టు కేవలం 52 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఫైనల్‌ దశ చేరుకున్నా కప్‌ దక్కించుకోలేకపోయిన భారత్‌, ఈసారి ఆ కలను సాకారం చేసింది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. క్రీడాభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు భారత మహిళా జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.ఇదే భారత మహిళల జట్టు తొలి ఐసీసీ ప్రపంచ కప్‌ టైటిల్‌గా నిలవడం విశేషం. ఈ విజయంతో భారత క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం రాసినట్టయింది. 🇮🇳🏆

Related posts

తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

TV4-24X7 News

కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి ఎందుకో తెలుసా

TV4-24X7 News

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

TV4-24X7 News

Leave a Comment