అమరావతి (ప్రతినిధి): సోషల్ మీడియా గ్రూప్‌లను నిర్వహించే అడ్మిన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వంపై గానీ, కేంద్రంపై గానీ విమర్శనాత్మక వ్యాఖ్యలు, దేవాలయాలు లేదా ఇతర ప్రార్థనా మందిరాలపై అవమానకర పోస్టులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా యూట్యూబ్ ఫేక్ లింకులు వంటి వాటిని ఎవ్వరూ గ్రూప్‌లలో పోస్ట్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటికే ఈ నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 100 మంది గ్రూప్ అడ్మిన్‌లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రజలలో అపోహలు, మతవిరోధాలు లేదా రాజకీయ విద్వేషాలు సృష్టించే పోస్టులు షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.సభ్యులు, అడ్మిన్‌లు జాగ్రత్తగా వ్యవహరించి, ఇతరులను ఇబ్బందులకు గురి చేయకూడదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
previous post

