Tv424x7
National

చైనాపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం

వాషింగ్టన్‌:

చైనాపై మరోసారి సుంకాలతో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ నిర్ణయంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.నాస్‌డాక్‌ సూచీ 3.56% క్షీణించగా,డౌ జోన్స్‌ సూచీ 1.90% పడిపోయింది.

ఎస్‌అండ్‌పీ 500 సూచీ కూడా 2.71% తగ్గింది.మార్కెట్‌ పతనంతో ఒక్కరోజులోనే మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్‌ డాలర్ల మేర ఆవిరయ్యింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌ విధానాలు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని మళ్లీ ఉధృతం చేసే అవకాశముందని, దాంతో గ్లోబల్‌ మార్కెట్లు ఇంకా అస్థిరతను ఎదుర్కోవచ్చని హెచ్చరించారు.

Related posts

అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే!

TV4-24X7 News

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

TV4-24X7 News

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment