వాట్సప్ ఖాతా బ్లాక్ అయినందుకు తిరిగి తెరవాలంటూ వ్యక్తి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఖండించింది.
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మేథా లతో కూడిన బెంచ్ విచారణలో “వాట్సప్ వాడటం ప్రాథమిక హక్కు కాదు” అని వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ – “వాట్సప్ అవసరం లేదు, దేశీయ యాప్ ‘అరట్టై (Arattai)’ వాడండి, మనదే మేలు” అని సూచించింది.
పిటిషనర్ వాదన ప్రకారం, తన వాట్సప్ అకౌంట్ ఎటువంటి కారణం లేకుండా బ్లాక్ అయిందని, తిరిగి తెరవాలని కోరాడు.
దీనిపై బెంచ్ స్పందిస్తూ, “ఇది రాజ్యాంగ హక్కులకు సంబంధించిన విషయం కాదు. ఇలాంటి కేసులు సివిల్ కోర్టుల్లో చూడవచ్చు” అని తెలిపింది.

