📍భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ములకలపల్లిములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బారిన పడిన గ్రామ పరిపాలనాధికారి!
ఏసీబీ అధికారుల ఉచ్చు బారిన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే— వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.60 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన, ఇప్పటికే రూ.40 వేల రూపాయలు స్వీకరించినట్లు సమాచారం. మిగిలిన రూ.15 వేల లంచం తీసుకుంటూ ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

