ప్రభుత్వం, అధికారులు అత్యవసర చర్యలకు సిద్ధం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం “మొంథా” మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 790 కిమీ, కాకినాడకు 729 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుఫాను మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని సూచన.
తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక.
తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు, సముద్రం అల్లకల్లోలం కానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసి, విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.
మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని సూచన.

