Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్‌ విరుచుకుపడనుంది – రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌!అమరావతి,…

రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే 12 గంటలు అత్యంత కీలకం అని హెచ్చరికలు జారీ చేసింది. మొంథా తుఫాన్‌ ప్రభావంతో మధ్య ఆంధ్ర తీర జిల్లాల్లో విస్తృత స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలు:

మచిలీపట్నం – దివిసీమ – కృష్ణా – పశ్చిమ గోదావరి – కోనసీమ – బాపట్ల జిల్లాల్లో గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం.

విజయవాడ – గుంటూరు – అమరావతి ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ. వరకు గాలులతో భారీ వర్షాలు కురిసే సూచనలు.

ప్రాంతాల వారీగా పరిస్థితి:

గోదావరి ప్రాంతం: ఉభయ గోదావరి జిల్లాల్లో 80–100 కి.మీ. వేగంతో గాలులు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు పరిసరాల్లో విద్యుత్‌ అంతరాయం, చెట్లు కూలే ప్రమాదం.

ఉత్తర ఏపీ: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అడపాదడపా భారీ వర్షాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండప్రాంతాల కారణంగా వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం.

దక్షిణ ఏపీ: ఉత్తర ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు తగ్గుతాయి. గుంటూరు, కడప, నంద్యాల, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చిరుజల్లులు కొనసాగుతాయి.

ప్రభుత్వ హెచ్చరికలు:

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.

తీరప్రాంత ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలి.

అత్యవసర సేవా బృందాలు సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం ప్రకారం, తుఫాన్‌ మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Related posts

అమరావతిలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపు

TV4-24X7 News

పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

బ్యాంకు లాకర్ లో ఉండవలసిన అభరణాలు ఈవో ఇంట్లో!!

TV4-24X7 News

Leave a Comment