Tv424x7
Telangana

హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’ – సీఎం రేవంత్ రెడ్డి,

హైదరాబాద్‌: తెలంగాణను ప్రపంచ సినీ పరిశ్రమకు వేదికగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ఆయన చెప్పారు –> “ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో… ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా. సినీ కార్మికుల కష్టాలు తెలియనంతగా నాకు కళ్లు మూసుకుపోలేదు,” అని సీఎం పేర్కొన్నారు.

సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక వెల్ఫేర్ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

సీఎం హామీ:సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుఅంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ అభివృద్ధిహైదరాబాద్లో హాలీవుడ్ స్థాయి టెక్నికల్ మౌలిక వసతులు

Related posts

ఎన్నికల లోపే మహిళలకు నెలకు రూ.2500…!

TV4-24X7 News

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి..

TV4-24X7 News

చేగమ్మ క్రాస్ రోడ్డులో లారీ–బైక్ ఢీకొన్న ప్రమాదం…

TV4-24X7 News

Leave a Comment