అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం.2025–26 విద్యా సంవత్సరానికి AP 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది.తాజా నిర్ణయం ప్రకారం, టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షెడ్యూల్ ప్రకటించడంతో పరీక్షల వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.విద్యాశాఖ త్వరలో విషయాల వారీగా పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల చేయనుంది.
next post

