ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో అప్రమత్తతను పెంచాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అవసరమైన చోట నాకా బందీ చేపట్టాలని ఆయన పోలీస్ శాఖకు సూచించారు.ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విజిలెన్స్ పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ పలు రాష్ట్రాలకు అలెర్ట్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు.సీపీ సజ్జనార్ మాట్లాడుతూ—సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలిరద్దీ ప్రాంతాలు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు పెంచాలిఅనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలిఅలాగే నగర పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.
previous post

