Tv424x7
National

ఢిల్లీలో కారు బాంబు పేలుడు.. సూత్రధారి ఉమర్ ఫొటో విడుదల

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన కారు బాంబు పేలుడు కేసులో కీలక ఆధారాలు వెలుగు చూశాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో 9 మంది మృతి, 20 మందికి పైగా గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు.పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. జమ్మూకశ్మీర్ పుల్వామాకు చెందిన ఉమర్ వైద్య నిపుణుడిగా పనిచేసినట్లు సమాచారం.హ్యుందాయ్ ఐ-20 వాహనంలో వేగం తగ్గిన సమయంలోనే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటన సమయంలో వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది.గాయపడిన వారిని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయాల స్వభావం ఆధారంగా ఇది ఆత్మాహుతి దాడి కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.పేలుడుకు ఉపయోగించిన పదార్థాల్లో:అమ్మోనియం నైట్రేట్ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమం ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.ఈ ఘటనకు కొన్ని గంటల ముందు ఫరీదాబాద్‌లో ఉమర్ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌పై పోలీసులు దాడి చేసి సుమారు 360 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఉమర్ కుటుంబ సభ్యులను పుల్వామాలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఉమర్ పేలుడులో మృతుడైయ్యాడా? లేక పరారీలో ఉన్నాడా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.పేలుడు కేసును ఢిల్లీ పోలీసులు, జమ్మూకశ్మీర్ ATS, NIA సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ధూమపానం పై హృదయాన్ని కదిలించే పోస్టర్ వైరల్…!

TV4-24X7 News

ట్రంప్ పుట్టుక పౌరసత్వం రద్దు ఆదేశం కోర్టులో వాయిదా..

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment