Tv424x7
National

ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్..

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి నదిలో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. యూపీలోని బరేలీ లో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు.తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్ నే ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. జీపిఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన చూపించడంతో దానినే అనుసరిస్తు వెళుతుండగా.. కారు నదిలో పడిపోయింది.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదుకు చేసుకొని విచారించారు. గూగుల్ మ్యాప్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.

Related posts

సైనిక ఆపరేషన్ల కవరేజీపై ఆంక్షలు: మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు

TV4-24X7 News

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

TV4-24X7 News

వివాహేతర సంబంధం.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment