Tv424x7
Andhrapradesh

సుప్రీంలో మద్యం కుంభకోణం నిందితులకు చుక్కెదురు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పును కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

Related posts

అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?

TV4-24X7 News

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment