Tv424x7
Telangana

వినాయక చందా కట్టలేదని..కుల బహిష్కరణ.

జగిత్యాల జిల్లా సంచలన ఘటనజగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో కుల పెద్దల తీరుపై కలకలం రేగింది.

వినాయక చందా కట్టలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన బయటపడింది.

ఒక్కో కుటుంబం నుంచి రూ.1,116 చందా తీసుకోవాలని పెద్దలు నిర్ణయించగా, ఇవ్వలేదని ఆ కుటుంబాలను సమాజం నుంచి వేరుచేశారు.

ఊరంతా డప్పు చప్పుల్లతో దండోర వేస్తూ ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ప్రకటన చేశారు.

ఎవరు మాట్లాడినా రూ.25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు.

బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

ఒక పండుగ పేరుతో కుల పెద్దల బహిష్కరణ తీరు గ్రామంలో చర్చనీయాంశమైంది.

.

Related posts

అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు

TV4-24X7 News

స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది.. మా మధ్య జరిగింది ఇదే, పూర్ణచందర్ లెటర్ వైరల్‌..*

TV4-24X7 News

రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment