Tv424x7
National

ఎలాన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా లారీ ఎల్లిసన్..

ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు, ఛైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను అధిగమించి ఎల్లిసన్ అగ్రస్థానంలో నిలిచారు.

ఒరాకిల్ షేర్లు భారీగా పెరగడంతో ఎల్లిసన్ సంపద 101 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 393 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక మస్క్ సంపద 385 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గింది.

ఎల్లిసన్ తొలిసారి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటివరకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, ఎల్‌వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.

👉 ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం:

  1. లారీ ఎల్లిసన్ – $393 బిలియన్
  2. ఎలాన్ మస్క్ – $385 బిలియన్
  3. జెఫ్ బెజోస్ – $309 బిలియన్
  4. బెర్నార్డ్ ఆర్నాల్ట్ – $202 బిలియన్.

Related posts

ఘోర సంఘటన వెలుగు చుసిన పోలీసులు…. పాపం మరి ఇంతలానా….

TV4-24X7 News

రెబలోడి బాక్సాఫీసు ఊచకోత ప్రభాస్ కి ప్రభాసే పోటీ…*

TV4-24X7 News

గూగుల్ మ్యాప్‌కు బదులుగా ఈ యాప్‌ను ట్రై చేయండి..

TV4-24X7 News

Leave a Comment