Tv424x7
Andhrapradesh

పాట్నాలో ఆర్జేడీ నేత రాజ్‌కుమార్‌ రాయ్‌ హత్య..


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆర్జేడీ (RJD) నేత రాజ్‌కుమార్‌ రాయ్‌ అలియాస్‌ అల్లాహ్‌ రాయ్‌ దారుణ హత్యకు గురయ్యారు.

బుధవారం రాత్రి పాట్నాలోని మున్నాచక్‌ ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే పరారయ్యారు. తీవ్రమైన గాయాలతో పడిపోయిన రాజ్‌కుమార్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతుడిగా ప్రకటించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భూవివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఘటనా స్థలాన్ని ముట్టడి చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రాజ్‌కుమార్‌ రాయ్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ముందు ఈ హత్య స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది.

👉 హత్యపై ఆర్జేడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టగా, పోలీసులు శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశారు.

Related posts

గుంటూరు మునిసిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష

TV4-24X7 News

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య :- జనసేన పార్టీ డేరంగుల జగదీష్

TV4-24X7 News

Leave a Comment