అమరావతి
:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నూతనత. ఇకపై అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వివరాలు వెల్లడిస్తూ –ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేసినట్లు తెలిపారు.ఆన్లైన్లో నామినేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసి, అభ్యర్థి సంతకం చేసి, నిర్దేశిత గడువులో ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు.
ఇక ఈ కొత్త విధానం అధికార పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

