Tv424x7
Andhrapradesh

పాఠశాల గోడ కూలి 5 ఏళ్ల విద్యార్థి మృతి, 10 మంది గాయపడ్డారు

కర్నూలు నగరంలో సోమవారం ఉదయం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కవాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గోడ కూలి ఐదేళ్ల రకీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు.

వివరాల ప్రకారం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన కొంతమంది విద్యార్థులను యాజమాన్యం బయట నిలబెట్టింది. అప్పుడు పాఠశాల గోడ ఒక్కసారిగా కూలిపోగా, విద్యార్థులు దాని కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంఘటనపై ఎస్ఎఫ్ఐ, సిపిఎం, సిఐటియు నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, బాలుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు మరియు గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. స్కూల్ యాజమాన్యంతో చర్చించి, పూర్తి స్థాయి విచారణ జరుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్: మంత్రి పార్థసారథి

TV4-24X7 News

ఏపీలో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

TV4-24X7 News

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

TV4-24X7 News

Leave a Comment