Tv424x7
Andhrapradesh

జైపూర్, ఆజ్మీర్, జోద్‌పూర్‌లలో GVMC కార్పొరేటర్ల అధ్యయన యాత్ర!!


గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కార్పొరేటర్లు నేటి నుంచి అధ్యయన యాత్రను ప్రారంభించారు. ఈ నెల 24న తిరిగి నగరానికి చేరుకోనున్నారు.

ఈ యాత్రలో భాగంగా రేపు కార్పొరేటర్లు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అక్కడి పట్టణాభివృద్ధి, మురుగు శుద్ధి వ్యవస్థ, శానిటేషన్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, మున్సిపల్ సేవల డిజిటలైజేషన్ వంటి అంశాలను పరిశీలించనున్నారు.

తదుపరి రోజుల్లో ఆజ్మీర్, జోద్‌పూర్ నగరాలను కూడా సందర్శించనున్నారు. ఆ పట్టణాల్లోని మున్సిపల్ పాలన, మౌలిక వసతుల అభివృద్ధి, పౌరసేవల నిర్వహణ విధానాలను అవగాహన చేసుకోనున్నారు.

GVMC అధికారులు ఈ అధ్యయన యాత్ర ద్వారా ఉత్తర భారత నగరాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను విశాఖపట్నంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు.

Related posts

ఇడుపులపాయలో దివంగత నేత,వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మాజీ సీఎం జగన్ ఘన నివాళి

TV4-24X7 News

లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన!!

TV4-24X7 News

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

Leave a Comment