హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది.
జోషి తన పిటిషన్లో, కమిషన్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేవలం సాక్షిగా వాంగ్మూలం మాత్రమే తీసుకున్నారని వాదించారు. ఈ వాదనను హైకోర్టు సమర్ధించింది.
కేసు తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.

