హైదరాబాద్‌లో
మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన ఆయనకు ఆకస్మికంగా ఛాతీ నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్నవారు తక్షణమే స్పందించారు.
వెంటనే ఆయనను అత్యవసరంగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మధు యాష్కీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంది.
ఆయన అనూహ్యంగా అస్వస్థతకు గురవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

